రేవంత్ రెడ్డికి అంతా నమ్మకమా ?
TeluguStop.com
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ను కాంగ్రెస్ ఓడించడంతో పాటు తాను కూడా కేసిఆర్ ను ఓడిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదే పదే చెబుతున్నారు.
మరి రేవంత్ రెడ్డి అంతా కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణమేంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ బలం రోజురోజుకూ పెరుగుతున్న సంగతి వాస్తవమే.ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉండడంతో పాటు బిఆర్‌ఎస్ పై ఎంతో కొంత వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్ పుంజుకుంది.
అయితే అధికారంలోకి వచ్చేంతా బలం కాంగ్రెస్ కు ఉందా అంటే సమాధానం లేని పరిస్థితి.
ఇకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారం కంటేకూడా బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది హస్తం పార్టీ.
"""/" / అందుకే కేసిఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
గజ్వేల్ నుంచి ఇప్పటికే తుంకుంట నర్సారెడ్డికి సీటు కేటాయించింది.ఇక కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని బరిలో దించితే ఎలా ఉంటుందనే దానిపై హస్తం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికూడా కేసిఆర్ తో ఢీ కొట్టేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కోడంగల్ సీటు కేటాయించింది అధిష్టానం.
ఈ సీటుతో పాటు కామారెడ్డి సీటు కూడా రేవంత్ రెడ్డికే కేటాయించేలా కసరత్తులు జరుతున్నాయట.
అయితే కామారెడ్డి నుంచి కాంగ్రెస్ ( Congress Party )తరుపున పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ మొదటి నుంచి ఆసక్తి చీపిస్తున్నారు.
ఇప్పుడు అనూహ్యంగా రేవంత్ రెడ్డి రేస్ లోకి రావడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ సీటు కేటాయించే అవకాశం ఉందట.
"""/" /
అయితే కామారెడ్డిలో కేసిఆర్( CM Kcr ) ను ఢీ కొట్టి రేవంత్ రెడ్డి నిలువగలరా ? అంటే అంతా సులభం కాదనే చెప్పాలి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ( Assembly Elections )కోడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి దారుణంగా ఓటమిపాలు అయ్యారు.
ఈసారి కూడా ఆయన గెలుపు కష్టమే అనే అభిప్రాయాలూ అడపా దడపా కొందరిలో వ్యక్తమౌతున్నాయి.
ఎందుకంటే ఓటుకు నోటు కేసు, పార్టీలో ఆయనపై ఉన్న వ్యతిరేకత.ఆయన ఓటు బ్యాంకును దూరం చేస్తే అవకాశాలు ఉన్నాయనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమౌతూ రిస్క్ చేస్తున్నారనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.
మరి రేవంత్ రెడ్డి కేసిఆర్ తో ఢీ కొడుతూ తన గెలుపుపై ఎందుకంత నమ్మకంగా ఉన్నారో చూడాలి.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?