గాంధీభవన్ కు భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డి.. !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలను సాధిస్తూ ముందంజలో దూసుకెళ్తుంది.

మ్యాజిక్ ఫిగర్ ను దాటి హస్తం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.అధికారికంగా ఇప్పటికే మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీభవన్ కు బయలుదేరారు.

ఈ క్రమంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఆయన నివాసం నుంచి గాంధీభవన్ కు చేరుకోనున్నారు.

పార్టీ కార్యాలయానికి వెళ్లిన అనంతరం రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలను సమీక్షించనున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆ రోల్ ను రిజెక్ట్ చేశారట.. పాపం ఇప్పుడు బాధ పడుతుంటారు!