మునుగోడు లో కాంగ్రెస్ గెలిచినా ఓడినా రేవంత్ సేఫ్ ?

తెలంగాణ కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ కనిపించవు.

పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడం,  ఎవరికి వారు గొప్ప లీడర్లము అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండడం , గ్రూపు రాజకీయాలు ఇలా ఎన్నో కాంగ్రెస్ కు అధికారాన్ని దూరం చేస్తున్నాయి.

ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కు అన్ని వరుస ఓటములే ఎదురవుతున్నాయి.

రెండుసార్లు పార్టీ అధికారం కి దూరం అయింది.పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా.

పార్టీకి పునర్వభవం తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారనే అభిప్రాయం పార్టీ అధిష్టానం పెద్దల్లో ఉంది.

అందుకే టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి అతి తక్కువ సమయంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించారు.

     ఆయన సారధ్యంలోనే ఇప్పటికి కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది.రేవంత్ శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు బాగా తెలుసు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగల సత్తా ఆయనకి ఉందని అధిష్టానం గుర్తించింది.

ఇది ఇలా ఉంటే.ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి.

ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని టిఆర్ఎస్, బిజెపితో పాటు , కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

అయితే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం,  ఆయన బిజెపిలో చేరడంతో ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి.

రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహిస్తారని అంతా భావించారు.

ఆయన సూచించిన పాల్వాయి స్రవంతికి మునుగోడు అసెంబ్లీ టికెట్ అధిష్టానం కేటాయించడంతో, ఇక ఎన్నికలు ప్రచారంలో ఉధృతంగా వెంకట రెడ్డి ప్రచారం చేస్తారని అంతా భావించినా.

వెంకటరెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు.విదేశాలకు వెళ్ళిపోయారు.

    """/"/  అయితే ఆయన ఫోన్ సంభాషణ లీక్ కావడం సంచలనం గా మారింది.

మునుగోడులో కాంగ్రెస్ ఓటమి చెందుతుందని , కాంగ్రెస్ ఓటమి చెందితేనే రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని తప్పించి తనను పిసిసి అధ్యక్షుడిగా చేస్తుందంటూ ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్ అయ్యింది.

ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డికి బాగా కలిసి రాబోతోంది.పార్టీని ఓడించేందుకు వెంకట్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించడం తో రేవంత్ పై ఆయన కక్ష కట్టారు అనే విషయం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులతో పాటు, ఆ పార్టీ అధిష్టానం పెద్దలకు అర్థమైంది.

దీంతో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.ఓటమి చెందినా.

 రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ సారధ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో కనుక లీక్ కాకపోయి ఉంటే.గెలుపోటముల భారం రేవంత్ పైన పడి ఉండేదని రేవంత్ అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.

 .

లవంగంతో బాన పొట్ట మాయం.. ఇంతకీ ఎలా తీసుకోవాలంటే?