మొత్తానికి తన కల నెరవేర్చుకుంటున్న రేవంత్ ! 

చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆరట పడుతూనే వస్తున్నారు.

అయితే పార్టీలోని గ్రూపు రాజకీయాల కారణంగా రేవంత్ కల నెరవేరకుండా వాయిదా పడుతూ వస్తోంది.

రేవంత్ పాదయాత్ర చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ , అధిష్టానం పెద్దల నుంచి అనుమతి పొందేందుకు అనేకసార్లు ప్రయత్నాలు చేసినా, సీనియర్ నాయకులు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసి, అధిష్టానం పెద్దలు రేవంత్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా చక్రం తిప్పారు.

అయితే ఇటీవల పార్టీ పరిస్థితి మరింత దెబ్బతనడం, తెలంగాణలో టిఆర్ఎస్ తో పాటు , బిజెపి మరింత బలం పుంజుకోవడం,  కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్ళబోతూ ఉండడం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తెలంగాణలో పార్టీ పరిస్థితి చక్కదిద్దేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపారు.

"""/"/ ఇక ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్చార్జిని మార్చి మాణిక్ రావు  థాక్రే ను నియమించారు.

ఆయన వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని పూర్తిగా అంచనా వేశారు.రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛ కల్పిస్తే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకు రాగలరని ఆయన బలంగా నమ్ముతున్నారు.

ఈ మేరకు అధిష్టానానికి నివేదిక పంపడంతో రేవంత్ రెడ్డి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఈరోజు 11 గంటలకు సమ్మక్క , సారక్క లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

మేడారం నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరు కాబోతున్నాయి.

మొత్తం రెండు నెలలపాటు ఈ యాత్రను చేపట్టనున్నారు.ఈ యాత్ర లో 50 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను హైలెట్ చేస్తూ రేవంత్ ఈ యాత్రను కొనసాగించబోతున్నారు.

"""/"/ ఈ యాత్రలో మొదటి నుంచి రేవంత్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న సీనియర్లు సైతం పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

పార్టీ ఈసారి జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే,  పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందనే భయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరిలోనూ కలగడంతో,  తమ విభేదాలను పక్కనపెట్టి రేవంత్ కు సహకరించేందుకు కాంగ్రెస్ సీనియర్ లు సైతం సిద్ధమవుతుండడం రేవంత్ వర్గంలో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇక ఈ రోజు మేడారం నుంచి కొత్తూరు నార్లాపూర్ ప్రాజెక్ట్ నగర్ వరకు రేవంత్ పాదయాత్రను నిర్వహిస్తారు.

ఇదేందయ్యా ఇది.. పైకి పాకుతున్న నది నీరు.. వీడియో చూస్తే నమ్మలేరు..