వైఎస్సార్‌ను ఓన్ చేసుకునే పనిలో రేవంత్.. కలిసొస్తుందా.. బెడిసికొడుతుందా..
TeluguStop.com
వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఉంది.
ఆయన హయాంలో చేసిన ఎన్నో మంచి పనులు ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేదు.
అందుకే రాజన్న రాజ్యం అంటే అంత క్రేజ్ ఉంది.ఆయన పేరు చెప్పుకునే ఏపాలో జగన్ అంత భారీ మెజార్టీతో సీఎం అయ్యారంటే మామూలు విషయం కాదు.
అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా వైఎస్సార్ పేరు చెప్పుకుని రాజకీయాల్లో అడుగు వేసేందుకు వై.
ఎస్.షర్మిల ముందుకు వచ్చారు.
ఆమె పార్టీ కూడా వైఎస్ పేరు మీదే పెట్టడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
అయితే ఇప్పుడు షర్మిలకు పోటీగా తెలంగాణ కాంగ్రెస్ మరో ఎత్తుగడ వేస్తోంది.అసలు వైఎస్ తమ వాడేనని, తమ పార్టీలోనే ఆయన సీఎంగా ఉన్నారని ఆయన చేసిన సేవా కార్యక్రమాల క్రెడిట్ తమ పార్టీకే చెందుతుందని ఇప్పుడు రేవంత్ వరుసబెట్టి చెప్పుకొస్తున్నారు.
ఇక ఇందులో భాగంగా నిన్న వైఎస్ఆర్ 12వ వర్థంతిని కూడా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేశారు.
ఏకంగా గాంధీభవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వైఎస్ ఫొటోకు రేవంత్ రెడ్డితో పాటు వైఎస్ ఆత్మ అయిన కేవీపీలాంటి ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళి అర్పించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
"""/"/
ఇక ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ వైఎస్సార్‌ను ఓన్ చేసుకునే విధంగా కామెంట్స్ చేశారనే చెప్పాలి.
వైఎస్సార్ కలలను తామే నిజం చేస్తామని చెప్పుకొచ్చారు.కాగా ఇప్పుడు తమ నాయకుడు అయిన రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చూడాలన్నిది వైఎస్ఆర్ చివరి కోరిక అని ఆ కోరికను తామే నెరవేరుస్తామంటూ చెప్పారు.
కాగా విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కూడా కాంగ్రెస్ తరఫున ఎవరూ వెళ్లొద్దని చెప్పడం కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది.
అయితే రేవంత్ వైఎస్‌ను ఓన్ చేసుకుంటే ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ రగిలి నష్టం జరుగుతుందా లేదంటే కలిసొస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి.
ఛీ, టాయిలెట్ బౌల్‌లో పక్షి మాంసం పెట్టి వండింది.. ఈ యువతికి మతిపోయిందా (వీడియో)