రేవంత్ ఇజ్ఞత్ కా సవాల్ గా ఎమ్మెల్సీ ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

రేవంత్ కారణంగానే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం పార్టీ అధిష్టానం పెద్దల్లో ఉండడంతోనే, సీనియర్లను పక్కనపెట్టి మరి ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి కి కట్టబెట్టారు.

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలను దక్కించుకునే విధంగా రేవంత్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇక ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం రేవంత్ కు సవాల్ గా మారింది.

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలతో పాటు, ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింతగా అధిష్టానం వద్ద తన పలుకుబడి పెరుగుతుందని రేవంత్ భావిస్తున్నారు.

అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. """/" / వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు హారహోరిగా జరుగుతోంది.

ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రధానంగా పోటీ పడుతున్నాయి.కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పోటీ చేస్తున్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ( Rakesh Reddy )పోటీ చేస్తున్నారు.

ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునేందుకు అన్ని రకాలుగా పయత్నాలు చేస్తోంది.

బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ ( KCR )తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో, కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నను గెలిపించుకునేందుకు రేవంత్ కూడా అంతే స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నారు.

"""/" / ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా తాజాగా రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు.

తమ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు జిల్లాల ఎమ్మెల్యేలు ,మంత్రులు, పార్లమెంట్ ఇన్చార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు, కోఆర్డినేటర్లతో రేవంత్ మాట్లాడారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునేందుకు అందరూ కష్టపడాలని సూచించారు.మే 27న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడేవిధంగా చూడాలని సూచించారు.

టాలీవుడ్ స్టార్ హీరోలతో పోల్చి చూస్తే కమెడియన్ బ్రహ్మానందం రిచ్.. అంత ఆస్తి ఉందా?