కేసీఆర్ కు త‌ల‌నొప్పిగా మారిన రేవంత్‌.. టీపీసీసీ చీఫ్ ధైర్యం ఏంటి..?

తెలంగాణలో ఒక‌ప్పుడు కేసీఆర్‌కు ఎదురే లేకుండా పోయింది.ఆయ‌న గ‌త ప్ర‌భుత్వంలో ఏది చెబితే అదే శాస‌నం అన్న స్థాయిలో తెలంగాణ రాజ‌కీయాలు ఉండేవి.

కానీ ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఇప్పుడు కొత్త రాజ‌కీయ శ‌క్తులు పుట్టుకువ‌స్తున్నాయి.ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌తి విష‌యంలో ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఆయ‌న ప్రెస్ మీట్ పెడుతున్నారంటేనే ఏదో ఒక సంచ‌ల‌నం రేపుతున్నారు.ఇక ఇందులో భాగంగా రీసెంట్ గా జీహెచ్ఎంసీ పరిధిలో కోకాపేటలో భూముల‌ను అమ్మేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వేలంపాట వేసిన సంగ‌తి తెలిసందే.

అయితే ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐకి కంప్ల‌యింట్ చేయ‌డం పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది.

ఈ వేలంలో దాదాపుగా వెయ్యి కోట్ల వ‌ర‌కు స్కాం జ‌రిగింద‌ని, కాబ‌ట్టి దీనిపై వెంట‌నే విచారణ జరిపి దోషులను శిక్షించాలంటూ ఆయ‌న ఫిర్యాదు చేశారు.

ఇక్క‌డే అస‌లు రేవంత్‌రెడ్డి ధైర్యం ఏంటో అర్థం కావ‌ట్లేదు ఎవ‌రికీ. """/"/ ఎందుకంటే ఒక సీఎంపై ఇలాంటి ఫిర్యాదులు చేసిన ఘ‌ట‌న‌లు చాలా త‌క్కువ‌.

ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు అంద‌లేదు.కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఇలా డేర్ చేస్తున్నారు.

ఇంకోవైపు అయితే తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వస్తామ‌ని అప్పుడు కేసీయార్ అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపిస్తామ‌ని బండి సంజ‌య్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.

కానీ రేవంత్ మాత్రం అధికారంలోకి రాక‌ముందే ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు.మ‌రి దీనిపై కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని ర‌చిస్తారో చూడాలి.

ముందు ముందు రేవంత్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే అది టీఆర్ ఎస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.

ప్రేమ బంధానికి గుడ్ బై.. ప్రియుడితో శృతిహాసన్ బ్రేకప్ చెప్పుకుందా?