ఇంద్రవెల్లి వేదికగా మరో పోరాటానికి రెడీ అయిన రేవంత్..!
TeluguStop.com
మొన్నటి వరకు కనీసం ఉనికి చాటుకోని పార్టీ.ఏ ఎన్నికల్లోనూ ఏ మాత్రం పొటీ చూపని పార్టీ ఇప్పుడు పరుగులు పెడుతోంది.
అదే కాంగ్రెస్ పార్టీ.ఈ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా దూకుడుగా వ్యవహరిస్తోంది.
కారణం రేవంత్ రెడ్డి కొత్త బాస్ కావడమే.తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం పోరాటాల దిశగా వెల్లని కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ హయాంలో చాలా జోష్ ను చూపిస్తోంది.
మొన్నటి వరకు ఈ పార్టీ నుంచే ఇతర పార్టీల్లోకి వలసలుగా వెళ్తే.ఇప్పుడు ఏకంగా ఈ పార్టీలోకే వలసలు వస్తున్నాయి.
ఇదంతా రేవంత్ ఎఫెక్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఇప్పుడు ఆయన అధ్యక్షుడు అయ్యాక వరుస పోరాటాలతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరి బిక్కరి చేస్తున్నారు.
ఇప్పుడు మరో ఉధృత పోరాటానికి రెడీ అయ్యారు ఫైర్ బ్రాండ్ రేవంత్.హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ దళిత వర్గాన్ని ఆకట్టుకునేందుకు దళితబంధు స్కీమ్‌ను పెట్టిన విషయం తెలిసిందే.
అయితే మొదటి నుంచి దళిత, గిరిజన వర్గాలు టీఆర్ ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని ఆ రెండు వర్గాలను కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండేలా చూసేందుకు రేవంత్ ప్లాన్ వేశారు.
"""/"/
ఈ మేరకు ఆగస్టు 9నుంచి ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన దండోరాను ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి.
ఈ పోరు యాత్ర ద్వారా కాంగ్రెస్‌కు దూరమైన ఈ దళిత, గిరిజన వర్గాలను దగ్గర చేసుకునేందుకు ఈ దండోరాను ప్లాన్ చేస్తున్నారు రేవంత్.
ఈ పోరులో కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేసిన మోసాలను ఎండగట్టేందుకు రేవంత్ ఎత్తుగడ వేస్తున్నారు.
ఈ పోరుయాత్రకు దాదాపు లక్ష మంది హాజరవుతున్నట్టు తెలుస్తోంది.ఉద్యమ నేపథ్యం ఉన్న ఇంద్ర వెల్లి అయితేనే తన పోరు బాటకు మరింత బాగుంటుందని రేవంత్ ఇక్కడి నుంచి తన పోరాటాన్ని చేస్తున్నారు.
వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!