తప్పు సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్ లోకి..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాజకీయ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తన తప్పు సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.

డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోనందుకే ఆ పార్టీని వీడానని చెప్పారు.తన లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమేనని తెలిపారు.

బీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ కే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణలోని అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని సూచించారు.

కాగా అగ్రనేతల సమక్షంలో ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవడం ఎలానో తెలుసా?