రాజన్న ఆలయ ఉద్యోగుల పదవీవిరమణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న ఆలయ ఉద్యోగ వర్గం లో పర్యవేక్షకులుగా అల్లి శంకర్ ,ముఖ్య అర్చకులుగా అప్పాల కరుణాకర్ , స్కావెంజర్ గా జాక్పాల్ విధులు నిర్వర్తిస్తూ ఈరోజు పదవీవిరమణ సందర్భంగా ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్ యందు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మొదటగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
తదుపరి ఆలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఈ ఈ రాజేష్ ,ఏ ఈ ఓ లు జయకుమారి, శ్రీనివాస్ లు, ఆలయ ఉద్యోగులు పదవీవిరమణ చెందిన ఉద్యోగులకు శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
బరువు తగ్గాలని భావించేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!