Pawan Kalyan : రాజకీయాల్లోనూ రిటైర్మెంట్ అవసరం..: పవన్ కళ్యాణ్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram )లో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పర్యటించారు.

గొప్ప వ్యక్తులకు కులాలకతీతంగా చూడాలని అన్నారు.కులాల మధ్య సఖ్యత లేకుంటే దేహి అని అడ్డుక్కోవాల్సిందేనని తెలిపారు.

"""/" / కులాల నాయకులు ఎదగడం కాదన్న ఆయన కులాల్లోని ప్రజలు బాగుపడాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కులాలను కలుపుకుని పోయే వారే భావితరం నాయకులని చెప్పారు.కులం కాదు, ఎవరు న్యాయం చేస్తారో ఆలోచించాలని తెలిపారు.

తాను సోషల్ ఇంజీనీరింగ్ ను అమలు చేస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్ కొత్తతరం నేతలు వస్తే జనసేన ఆహ్వనిస్తుందని వెల్లడించారు.

అలాగే రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ అవసరమన్నారు.అప్పుడే కొత్తతరం నాయకులకు అవకాశం వస్తుందని తెలిపారు.

తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?