ఐఏఎస్ అధికారికే రూ.5లక్షల కుచ్చు టోపీ పెట్టిన సైబర్ నేరగాళ్లు..!

ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించే పోలీసులు, ప్రభుత్వ అధికారులే కొన్ని సందర్భాల్లో సైబర్ నేరగాళ్ల( Cyber Crime ) వలలో చిక్కి లక్షలు పోగొట్టుకుంటున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

తాజా గా లక్నోకు( Lucknow ) చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సైబర్ వలలో చిక్కి రూ.

5 లక్షలు పోగొట్టుకున్నాడు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.లక్నోలోని ప్రగ్ నారాయణ్ రోడ్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాం కున్వర్ కు( Ram Kunwar ) అక్టోబర్ మూడవ తేదీ రూ.

29.78 కోట్లు ఖాతాలో జమ అయ్యాయని ఓ మెసేజ్ వచ్చింది.

రాం కున్వర్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే సెంట్రల్ బ్యాంక్( Central Bank ) జాప్లింగ్ రోడ్డు బ్రాంచ్ ను సంప్రదించారు.

అయితే ఆ మెసేజ్ బ్యాంకు నుంచి పంపలేదని బ్యాంక్ మేనేజర్ నిర్ధారించి ఆపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

"""/" / కున్వర్ కు బ్యాంకు నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఈ విషయాన్ని బ్యాంక్ జోనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

కానీ జోనల్ మేనేజర్ కూడా ఎలాంటి సహకారం చేయలేదు.పైగా ఆ పని బ్యాంక్ లో( Bank ) తన జూనియర్ అధికారిని చూడాలని పురమాయించాడు.

అయితే కున్వర్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ సీనియర్ అధికారినని తన పేరు అవినాష్( Avinash ) అని పరిచయం చేసుకున్నాడు.

"""/" / రూ.29.

78 కోట్లు క్రెడిట్ అయ్యే మెసేజ్ పొరపాటున వచ్చిందని, ఎనీ డెస్క్ యాప్( Any Desk App ) డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు.

ఆ తర్వాత ఐఏఎస్ అధికారికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఖాతాల వివరాలు అన్ని ఆ వ్యక్తి సంగ్రహించాడు.

అనంతరం సెంట్రల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.

65 లక్షలు, యూనియన్ బ్యాంక్( Union Bank ) ఖాతా నుంచి రూ.

50 వేలు డెబిట్ అయినట్టు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కున్వర్ కు మెసేజ్ వచ్చింది.

దీంతో తాను సైబర్ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకున్నట్లు గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భార్యతో విడిపోయి షాకిచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో.. విడాకుల వెనుక కారణాలు ఇవే!