అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు..!

అనంతపురం జిల్లా( Anantapur District ) రాయదుర్గంలో ఎన్ఐఏ( NIA ) దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి.

ఈ మేరకు నాగులబావి వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్( Retired Head Master Abdul ) ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

కాగా అబ్దుల్ కుమారులు బెంగళూరులో నివాసం ఉండేవారు.అయితే గత కొంత కాలంగా అబ్దుల్ కుమారులు కనిపించడం లేదని తెలుస్తోంది.

అనుమానం రావడంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ( ఎన్ఐఏ) అధికారులు అబ్దుల్ నివాసంలో సోదాలు చేశారు.

ఈ క్రమంలోనే అబ్దుల్ ను అదుపులోకి తీసుకున్నారు.ఉగ్రవాదులతో ( Terrorists ) లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

రైతుబిడ్డ యాడున్నావ్.. ఆ పైసలెక్కడ.. యువసామ్రాట్ రవి కామెంట్స్ వైరల్!