సైబర్ వలలో చిక్కిన తిరుపతికి చెందిన విశ్రాంత ఉద్యోగి..ఖాతా నుంచి రూ.4.25 కోట్లు స్వాహా..!
TeluguStop.com
ప్రభుత్వాలు, అధికారులు సైబర్ నేరాల( Cyber crimes ) పట్ల ఎంత అవగాహన కల్పించిన సైబర్ నేరాలు మాత్రం పెరుగుతున్నాయి తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.
ప్రతిరోజు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
తాజాగా తిరుపతిలో( Tirupati ) నివసిస్తున్న ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ వలలో చిక్కి పూర్తిగా మోసపోయి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం. """/" /
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కోరుట్ల కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి గత కొంతకాలంగా తిరుపతిలో నివాసం ఉంటున్నారు.
ఈ ఉద్యోగికి కోరుట్ల బ్యాంకులో( Corutla Bank ) ఖాతా ఉంది.రెండు రోజుల క్రితం ఒక మహిళ ఫోన్ చేసి మీ ఆధార్ కార్డుకు, ఫోన్ నెంబర్ అనుసంధానం కాలేదని, ఖాతా వివరాలు చెబితే అనుసంధానం చేస్తానని చెప్పడంతో ఆ ఉద్యోగి తన ఖాతా వివరాలు మొత్తం చెప్పేశాడు.
"""/" /
ఈరోజు సాయంత్రం మరో వ్యక్తి ఫోన్ చేసి తాను మహారాష్ట్రకు ( Maharashtra )చెందిన ఒక ఐఏఎస్ అధికారిని మాట్లాడుతున్నానని, మీపై పలు కేసులు ఉన్నాయని ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోందని, విచారణ కోసం ఖర్చు అవుతుందని బెదిరించి విశ్రాంత ఉద్యోగి నుంచి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకున్నాడు.
తర్వాత మీపై ఎలాంటి కేసులు లేవని చెప్పాడు.కాసేపటికే ఆ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది.
టనే అతను కోరుట్ల కు వచ్చి బ్యాంక్ ఖాతాను పరిశీలించగా ఆన్లైన్ ద్వారా నగదు డ్రా అయినట్లు బ్యాంక్ అధికారుల ద్వారా తెలుసుకుని, ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసిన వ్యక్తుల నెంబర్లు మహారాష్ట్రకు చెందినవిగా గుర్తించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?