దొంగతనం కేసులో అరెస్టయిన రచయిత కులశేఖర్ అసలు కథ ఇది.. సోషల్ మీడియాలో అన్ని పుకార్లే
TeluguStop.com
వంద చిత్రాల్లో పాటలు రాసిన సినీ రచయిత కులశేఖర్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
బ్రహ్మణ సమాజం తనను వెలివేయడం వల్లే బ్రహ్మణుల వస్తువులను దొంగతనం చేసేందుకు కులశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ, ఆయన్ను కుటుంబ సభ్యులు వెలివేశారంటూ రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న కులశేఖర్ గురించి ఆయన సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కులశేఖర్‌ను బ్రహ్మణ సమాజం కాని, ఆయన కుటుంబం కాని వెలి వేయలేదని, ఆయన్ను ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు తక్కువగా చూడలేదని చెప్పుకొచ్చారు.
సినిమా పరిశ్రమలో ఉన్న సమయంలో ఆయన తాగుడుకు బానిసై తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.
దాంతో పాటు ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేకుండా పోయింది.దాంతో ఆయనకు కుటుంబ సభ్యులు విశాఖపట్నం తీసుకు వెళ్లి చికిత్స అందించారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన పరిస్థితి బాగు అవ్వడంతో మళ్లీ హైదరాబాద్‌కు సినిమాల్లో ఆఫర్ల కోసం వచ్చాడు.
సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ మానసికంగా డిస్ట్రబ్ అయ్యాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
సినిమాల్లో ఆఫర్ల కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేసిన కులశేఖర్ చివరకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు.
దొంగతనాలను మానసిక పరిస్థితి బాగాలేని కారణంగా చేస్తున్నాడు తప్ప కావాలని కాదు అంటూ కులశేఖర్ కుటుంబ సభ్యులు అంటున్నారు.
దొంగతనాలు చేసేంతగా ఆయన ఆర్థిక పరిస్థితి దిగజారి పోలేదని కొందరు అంటున్నారు.మొత్తానికి మీడియాలో వస్తున్న వార్తలు చాలా వరకు పుకార్లు అని, ఆయన్ను కుటుంబ సభ్యులు ఇప్పటికి కాపాడుకుంటూనే వస్తుంది.
బ్రహ్మణులు కూడా ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నారు.సోషల్ మీడియాలో లేనిపోని పుకార్లను పుట్టిస్తున్నారు.