‘క్రాక్‌’ విడుదల సమస్యకు ‘టెంపర్‌’ రీమేక్‌ కారణం

కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో థియేటర్లకు తాళం పడింది.మళ్లీ ఇన్నాళ్లకు ఆ తాళం తీశారు.

ఇంకా కరోనా భయం ఉన్న నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చారు.

అయినా కూడా సంక్రాంతి సీజన్ ను క్యాష్‌ చేసుకునేందుకు రవితేజ క్రాక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు.

ఈ ఏడాది మొదటి సినిమా గా క్రాక్‌ విడుదలకు సిద్దం అయ్యింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి.

కాని ఫైనాన్షియల్‌ కారణాల వల్ల చెన్నై కోర్టు సినిమా విడుదలకు స్టే విధించింది.

దాంతో సినిమా విడుదలకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.ఈ సినిమాను విడుదల చేయక పోవడంకు కారణం ఎన్టీఆర్ నటించిన టెంపర్‌ తమిళ రీమేక్‌ అయోగ్య అంటున్నారు.

"""/"/ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయోగ్య సినిమాను ఠాగూర్ మధు నిర్మించిన సమయంలో ఒక తమిళ నిర్మాణ సంస్థ వద్ద ఫైనాన్స్‌ తీసుకున్నాడు.

ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.దాంతో ఫైనాన్స్‌ మొత్తంను చెల్లించడంలో ఠాగూర్ మధు విఫలం అయ్యాడు.

అప్పటి నుండి ఈ డబ్బుల విషయంలో గందరగోళం నెలకొంది.క్రాక్‌ సినిమా విడుదల సమయం వరకు ఆ డబ్బును క్లియర్ చేస్తాను అంటూ ఠాగూర్‌ మధు చెబుతూ వచ్చాడు.

కాని ఆ డబ్బును చెల్లించక పోవడంతో తమ వద్ద ఉన్న అగ్రిమెంట్‌ తో సదరు తమిళ నిర్మాన సంస్థ కోర్టుకు వెళ్లింది.

కోర్టు కాస్త స్టే ఆర్డర్ ను ఇచ్చింది.అలా ఎన్టీఆర్ నటించిన టెంపర్‌ సినిమా రీమేక్‌ అయోగ్య క్రాక్‌ రిలీజ్ కు అడ్డుగా మారింది.

నేడు లేదా రేపు ఈ వివాదం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం నిర్మాత చర్చలు జరుపుతున్నాడు.

కెనడా గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్.. వీడియో వైరల్..