భూపాలపల్లి జిల్లాలో సాయం కోసం మోరంచపల్లి వాసుల ఎదురుచూపులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మోరంచపల్లిని భారీ వరద చుట్టుముట్టింది.

మోరంచపల్లి గ్రామంలో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో సహాయక చర్యల కోసం రెండు ఆర్మీహెలికాఫ్టర్లను పంపింది తెలంగాణ ప్రభుత్వం.

మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.ఇప్పటికే వరద ప్రాంతాలలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి.

బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేయాలంటే ఈ జ్యూస్ తాగండి..!