నల్లగొండ జిల్లా వాసికి పీహెచ్డీలో డాక్టరేట్

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన కొండ్రెడ్డి వనజ పీహెచ్డీలో డాక్టరేట్ పొందారు.

ఆమె జంతుశాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉత్తరప్రదేశ్ లోని మొనాడ్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.

జంతుశాస్త్రంలో కాన్పూర్ వద్ద గంగానదిలో అకశేరుకాల యొక్క కాలానుగుణ గతిశీలతను విశ్లేషించటం అనే అంశంపైన డాక్టర్ కపిల్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు.

వనజ నల్లగొండ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

పీహెచ్డీ పట్టా రావటంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు,సహచర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఈ టౌన్‌లో రిటైర్‌మెంట్ లైఫ్ గడుపుతున్న ముసలి పిల్లులు.. ఎక్కడంటే..?