జాతీయ కబడ్డీ పోటీలకు అంపైర్ గా గరిడేపల్లి మండలవాసి…!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి టెక్నికల్ అఫీషియల్(అంపైర్)గా నియమితులైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రకటించింది.

హైదరాబాదులో జరిగే 49వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆయన అంపైర్ గా వ్యవహరించనున్నారు.

ఈ పోటీలలో దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు అంపైరుగా వ్యవహరించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ప్రతి సినిమా ఒక ప్రయోగమే.. ప్రతిసారి ఒక గుణపాఠమే.. ప్రభాస్ సినిమా జీవితం ఎంతో ఆదర్శనీయం