చిలువకు ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రాణదానం చేశారు.. ఎక్కడంటే?
TeluguStop.com
రోడ్డు ప్రమాదంలో లేదా ఇతర ప్రమాదాల్లో గాయపడిన వారికి అవసరం అయితే శస్త్ర చికిత్స నిర్వహిస్తారు.
ఒంట్లో తీవ్ర గాయాలైన ప్రదేశంలో ఆపరేషన్ చేస్తారు.ఎముకలు విరిగితే కట్లు కట్టడం, అంతర్గత అవయవాలకు గాయాలు అయితే సర్జీరీ చేయడం తెలిసిందే.
అయితే పైథాన్ కు ఆపరేషన్ చేసి సర్జరీ నిర్వహించి దాని ప్రాణాలను కాపాడారు వైద్యులు.
మహారాష్ట్రలో జరిగిన ఈ ఆపరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదో భారీ కొండ చిలువ.అయితే శత్రువు దాడిలో గాయపడిందో లేదా మరో ఇతర కారణాల వల్ల పైథాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఒళ్లంతా గాయాలు అయి రక్తస్రావం అవుతోంది.పలు చోట్ల ఎముకలూ విరిగాయి.
అలాంటి స్థితిలో ఉన్న కొండ చిలువను ఓ కాలువలో గుర్తించారు స్థానికులు.వెంటనే అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు.
వారు వచ్చి ఆ భారీ కొండ చిలువను అతి జాగ్రత్తగా ఆస్పత్రికి తరలించారు.
ఆ భారీ పైథాన్ కు నోటి లోనూ గాయాలు కావడంతో అది ఆహారం తీసుకోవడం లేదని గుర్తించారు వైద్యులు.
"""/"/
చావు అంచుల వరకు వెళ్లి ఆ కొండ చిలువను బతికించే పనిలో ఉన్నారు వైద్యులు.
ఇప్పటికే దానికి రెండు మేజర్ సర్జరీలు చేశారు.ఆ కొండ చిలువ చికిత్స స్పందిస్తోంది.
అయితే దానికి మరికొన్ని సర్జరీలు అవసరం కాగా వాటిని నిర్వహించే పనిలో ఉన్నారు.
అన్నీ ఒకేసారి చేయలేని పరిస్థితి ఉండటంతో ఒకదాని తర్వాత ఒకటిగా సర్జరీలు చేస్తున్నారు.
పూర్తిగా కోలుకున్న తర్వాత దానిని అడవిలో వదిలి పెడతామని స్వచ్ఛం సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.