తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్
TeluguStop.com
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీ షెడ్యూల్ విడుదల అయింది.ప్రభుత్వం ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణ షెడ్యూల్ లో మార్పులు టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది.
రీ షెడ్యూల్ లో భాగంగా నవంబర్ 2, 3 వ తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ.
అయితే పరీక్షలు వాయిదా వేయాలన్న గ్రూప్-2 అభ్యర్థుల విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు పరీక్ష వాయిదా విషయంపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఆగస్ట్ 29, 30 వ తేదీల్లో జరగాల్సిన తెలంగాణ గ్రూప్ -2 ఎగ్జామ్స్ నవంబర్ 2, 3 వ తేదీలకు రీషెడ్యూల్ చేయబడింది.
అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?