అమెరికా అధ్యక్ష ఎన్నికలు : లైవ్‌లో ర్యాపింగ్ టాలెంట్ బయటపెట్టిన వివేక్ రామస్వామి .. సర్వేల్లో దూకుడు

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ) బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

రిపబ్లికన్ పార్టీ( Republican Party ) తరపు నుంచి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించిన ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.ఈ క్రమంలో ఫాక్స్ న్యూస్‌ నిర్వహించిన ‘‘ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌’’తో( Fox And Friends ) మాట్లాడుతూ తనలోని ర్యాపింగ్ స్కిల్స్‌ను (పాప్ సింగర్) ప్రదర్శించారు.

కాలేజీ రోజుల్లో ర్యాపర్‌గా అదరగొట్టిన రోజులను వివేక్ గుర్తుచేసి, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన కొత్త కోణాన్ని తీసుకొచ్చారు.

సాక్షోఫోన్ వాయించడంలో నిష్ణాతుడైన మాజీ అర్కాన్సాస్ గవర్నర్‌ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వివేక్ తెలిపారు.

రామస్వామి తనలోని కళను బయటపెట్టడం ద్వారా అధ్యక్ష పదవికి తాను తీవ్రమైన పోటీదారుణ్ణి మాత్రమే కాకుండా ప్రతిభ వున్న వ్యక్తి అని నిరూపించాడు.

37 ఏళ్ల వివేక్ హర్వర్డ్ కాలేజ్, యేల్ లా స్కూల్‌లో తన అండర్ గ్రాడ్యుయేట్ రోజులలో ఫ్రీ స్టైలింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తే వేదికపై ‘‘డా వెక్’’ అని తనను పిలిచేవారని వెల్లడించారు.

ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించనప్పటికీ.ఆయన విజయవంతమైన పెట్టుబడిదారుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ క్రమంలో బయోఫార్మాస్యూటికల్ కంపెనీ రోవాంట్ సైన్సెస్‌ను స్థాపించాడు.రాజకీయాల్లోనూ సత్తా చాటాలని భావిస్తోన్న వివేక్‌కు ఇటీవలి సర్వేలు కూడా అనుకూలంగా వస్తున్నాయి.

"""/" / ‘‘ RealClearPolitics ’’ నిర్వహించిన తాజా సర్వేలో రామస్వామి 5.

4 శాతం మంది ప్రజల మద్ధతుతో జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచారు.

సెనేటర్ టిమ్ స్కాట్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి , భారత సంతతికి చందిన నిక్కీ హేలీ,( Nikki Haley ) మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్,( Mike Pence ) న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గమ్ వంటి నేతలను వివేక్ రామస్వామి అధిగమించారు.

ఫాక్స్ న్యూస్‌లో తన ర్యాపింగ్ స్కిల్స్‌ను బయటపెట్టడం ద్వారా వివేక్ రామస్వామి పెద్ద ఎత్తున అమెరికన్ల( Americans ) దృష్టిని ఆకర్షించారని చెప్పవచ్చు.

రాజకీయం, ప్రజాకర్షణ విధానాలను ఏకకాలంలో చేయడం ద్వారా వివేక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

"""/" / భారతీయ వలసదారులకు జన్మించారు వివేక్ రామస్వామి.ఈయన తండ్రి జనరల్ ఎలక్ట్రిక్ ఇంజనీర్.

తల్లి డాక్టర్.ఈ దంపతులకు రామస్వామి సిన్సినాటిలో జన్మించారు.

హార్వర్డ్, యేల్ యూనివర్సిటీలలో ఆయన చదువుకున్నారు.ఈయన సంపద విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు.

అమెరికాలో విజయవంతమైన బయోటెక్ వ్యవస్థాపకుడిగా వివేక్ రామస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన కంపెనీ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఐదు ఔషధాలు సహా పలు మందులను అభివృద్ధి చేసింది.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!