ఈ ఆలయంలో ఫిబ్ర‌వ‌రిలో గణతంత్ర వేడుక‌లు.. కార‌ణ‌మిదే!

జనవరి 26న దేశమంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు, అయితే దేశంలో ఒక దేవాలయంలో ఫిబ్రవరి 9న రిపబ్లిక్ డే జరుపుకుంటారు.

ఉజ్జయినిలోని బడా గణేష్ మందిర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వ‌హించారు.దీని వెనుక గ‌ల కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

వాస్తవానికి ఉజ్జయినిలోని బడా గణేష్ మందిర్‌లో జాతీయ పండుగలు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా హిందూ క్యాలెండర్ తేదీ ప్రకారం జరుపుకుంటారు.

అందుకే ఈ ఆలయంలో ఫిబ్రవరి 9వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని నిర్వ‌హిస్తారు.భారతదేశంలో రిపబ్లిక్ డేను 1950 నుంచి జ‌న‌వ‌రి 26 నుంచి నిర్వ‌హిస్తున్నారు.

హిందూ క్యాలెండ‌ర్ ప్ర‌కారం ఆ రోజు మాఘ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి.

కాబట్టి, ప్రతి సంవత్సరం మాఘమాసంలోని శుక్ల పక్షంలోని అష్టమి రోజున ఉజ్జయినిలోని బడా గణేష్ ఆలయంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుతుంటారు.

ఫిబ్రవరి 9న‌ ఉదయం 11 గంటలకు గణేష్ ఆలయంలో, గణతంత్ర సమగ్రత, శ్రేయస్సు కోసం భగవంతునికి పంచామృత అభిషేక పూజలు నిర్వ‌హిస్తారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు అక్షయ కలశ ప్రతిష్ఠాపన చేసి 10 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

"""/" / హిందూ క్యాలెండర్ ప్రకారం అన్ని జాతీయ పండుగలతో పాటు పండుగలు మరియు ఉపవాసాలు జరుపుకునే దేశంలోని ఏకైక ఆలయం ఉజ్జయిని బడా గణేష్ మందిర్ ఒక్క‌టే కావ‌డం విశేషం.

ఆలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణేశుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించి కరోనా సంక్షోభాన్ని నివారించాల‌ని వేడుకున్నారు.

ఇదే విధంగా హిందూ క్యాలెండ‌ర్‌ను అనుస‌రించి జాతీయ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తే వేర్వేరు తేదీల‌లో జ‌రుగుతాయి.

ఏదిఏమైన‌ప్ప‌టికీ బడా గణేష్ మందిర్‌లో ఇటువంటి ఉత్సహం నిర్వ‌హించ‌డం విశేషమే మ‌రి.ఇక్క‌డ జ‌రిగే వేడుక‌ల‌కు స్థానికులు హాజ‌ర‌వుతుంటారు.

ట్రంప్ షూటింగ్ ఎటాక్: చనిపోయిన యూఎస్ పౌరుడు ఒక రియల్ హీరో..??