రిపబ్లిక్ డే బంపరాఫర్: రూ.26కే వైర్‌‌లెస్ ఇయర్‌బడ్స్!

మీరు కొత్తరకం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలని అనుకుంటే మీకోసం ఓ భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.

వైర్‌లెస్ టీడబ్ల్యూఎస్ బడ్స్ అతితక్కువ ధరకే ఇపుడు లభిస్తున్నాయి.రిపబ్లిక్ డే సందర్భంగా మీరు ఈ ఆఫర్ పొందొచ్చు.

లావా ఇంటర్నేషనల్ కంపెనీ తన ఆడియో ప్రొడక్టులపై ఈ ఆఫర్ పాటించింది.ఈ ఆఫర్‌లో భాగంగా మీరు కేవలం రూ.

26తో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ సొంతం చేసుకోవచ్చు.జనవరి 26న ఈ స్పెషల్ సేల్ మీకు అందుబాటులో ఉంటుంది.

ఇందులో భాగంగా కస్టమర్లు కేవలం రూ.26కే ఇయర్ బడ్స్ సొంతం చేసుకోవచ్చని తాజా ప్రకటనలో కంపెనీ పేర్కొంది.

"""/"/ కంపెనీ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి లావా స్టోర్‌లో ఈ సేల్ జరుగుతుంది.

అలాగే దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో కూడా ఈ సేల్ అందుబాటులో వుంది.

స్టాక్ ఉన్నంత వరకే ఈ డీల్ అందుబాటులో ఉంటుందని కస్టమర్లు గుర్తించుకోవాలి.సెకన్ల వ్యవధిలో స్టాక్ అయిపోవచ్చు కనుక మీరు కొనాలకున్నవారు అప్రమత్తం అయితే బావుంటుంది.

లావా స్టోర్ లేదా అమెజాన్‌లో ఈ రూ.26 ఇయర్ బడ్స్ ఆఫర్ సేల్ జనవరి 26న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది.

మీరు ఒక ఐదు నిమిషాలు ముందుగానే రెడీగా ఉంటే ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.

"""/"/ ఇకపోతే బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ వంటి కలర్స్‌లో ఈ ఇయర్ బడ్స్ కస్టమర్లకు లభిస్తున్నాయి.

ప్రోబడ్స్ 21లో అదిరిపోయే ఫీచర్లు మీకు చూడవచ్చు.12 MM డైనమిక్ డ్రైవ్స్, సిరి వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బ్లూటూత్ 5.

1 కనెక్టివిటీ, అల్ట్రా లో లాటెన్సీ 75 మిల్లీ సెకన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు మీరు కనీస ధరలలోనే పొందవచ్చు.

ఇంకా చెప్పాలంటే వీటికి IPX4 వాటర్ రెసిస్టెన్సీ రేటింగ్ ఉంది.60 MAH బ్యాటరీ, ఒక్కసారి చార్జింగ్ పెడితే 9 గంటలు వరకు కాస్తుంది.

అదే కేస్ చార్జింగ్‌ ప్రకారం చూస్తే.45 గంటల పాటు పాటలు వినొచ్చు.

అలాగే ఈ ఇయర్ బడ్స్‌లో క్విక్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంది.కాబట్టి ఆలస్యం చేయక త్వరపడండి.

వైరల్ వీడియో: మాజీ మంత్రి రోజా తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. మ్యాటరేంటంటే..