రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవం..: టీఎస్ గవర్నర్ తమిళిసై
TeluguStop.com
రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు.తాను ఎటువంటి ఎంపీ టికెట్ అడగలేదని తెలిపారు.
అలాగే పార్టీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే పోటీ గురించి తాను ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని చెప్పారు.అలాగే తూత్తుకుడి కార్యక్రమంలో పాల్గొనేందుకే ఢిల్లీ వెళ్లానని తెలిపారు.
తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని వెల్లడించారు.అయితే గవర్నర్ తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లారని .
సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ కేసు వాదించిన నిరంజన్ రెడ్డి ఎవరు? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?