Praneet Rao Case : ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక
TeluguStop.com
ఎస్ఐబీ డీఎస్సీ ప్రణీత్ రావు( SIB DSP Praneet Rao Case ) వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందింది.
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ( CC Cameras )ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
"""/" /
ఎస్ఐబీ( SIB )లోని కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు గుర్తించారు.
ప్రణీత్ రావుపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం అయింది.ఈ క్రమంలోనే అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీరియస్ అయింది.
రహస్య సమాచారం, వ్యక్తిగత వివరాలు తస్కరించడంపై కేసులు నమోదుతో పాటు మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపైనా అధికారులు విచారణ చేస్తున్నారు.ఈ క్రమంలో సీఐడీ లేదా సిట్ కు కేసును అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!