మెడికో ప్రీతి కేసులో ప్రభుత్వానికి వైద్యుల బృందం నివేదిక
TeluguStop.com
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలోని మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో వైద్యుల బృందం నివేదిక సిద్ధమైంది.
ఈ నివేదికను ప్రభుత్వానికి అందించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.ఇందులో భాగంగా ప్రీతిని వేధించిన డాక్టర్ సైఫ్ ను కాలేజీ నుంచి అధికారులు సస్పెండ్ చేశారు.
ఈ క్రమంలో సైఫ్ కు శిక్ష పడితే కాలేజీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ప్రీతికి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
మరీ ఇంత దారుణమా.. స్కూటర్‌తో ఢీకొట్టి.. మనిషిని అక్కడే వదిలేసి వెళ్లిపోయిన మహిళ!