మెడ మొత్తం నల్లగా అసహ్యంగా మారిందా.. ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!

సాధారణంగా ఒక్కోసారి మెడ మొత్తం నల్లగా( Dark Neck ) అసహ్యంగా మారిపోతుంటుంది.

ముఖం ఒక రంగులో, మెడ ఒక రంగులో కనిపిస్తుంటుంది.ఎండల ప్రభావం, మురికి మృత కణాలు పేరుకుపోవడం, మాయిశ్చరైజర్ వాడకపోవడం, పిగ్మెంటేషన్, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల మెడ రంగు తగ్గుతుంటుంది.

అయితే డార్క్ నెక్ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీస్‌ కనుక పాటిస్తే ఇంట్లోనే ఈజీగా డార్క్ నెక్ ను రిపేర్ చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్( Sugar Powder ) వేసుకోవాలి.

అలాగే పావు టీ స్పూన్ సాల్ట్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై మరొక పది నిమిషాలు చర్మాన్ని ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించారంటే మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

ఈ రెమెడీ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.మెడ నలుపును క్రమంగా మాయం చేస్తుంది.

"""/" / అలాగే మెడ నలుపును తగ్గించడానికి మరొక అద్భుతమైన చిట్కా ఉంది.

అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా ట‌మాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత చర్మాన్ని రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించిన మెడ నలుపు పోతుంది. """/" / ఇక ఈ ఇంటి చిట్కాలతో పాటు రెగ్యులర్ గా మెడకు మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

అలాగే పేలవమైన పరిశుభ్రత చెమట, సెబమ్, బాక్టీరియా మరియు ధూళిని పెంచడానికి కారణమవుతుంది.

ఇది మీ చర్మం ముదురు రంగులో కనిపించేలా చేస్తుంది.అందువల్ల వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ముఖ్యం.

వైరల్ వీడియో: పిల్లలు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే