Dry Hair : డ్రై హెయిర్ తో బాగా ఇబ్బంది పడుతున్నారా.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా!

డ్రై హెయిర్( Dry Hair )మనలో చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

అందులోనూ ప్రస్తుత చలికాలంలో డ్రై హెయిర్ ప్రాబ్లం అనేది మరింత అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

ఎంత ఖరీదైన షాంపూ, కండిషనర్ వాడినప్పటికీ జుట్టు పదే పదే పొడిబారిపోతూ ఉంటుంది.

దాంతో సెలూన్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు.ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతుంటారు.

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా డ్రై హెయిర్ ను రిపేర్ చేసుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

"""/" / ఈ రెమెడీని కనుక పాటిస్తే డ్రై హెయిర్ సమస్యకు బై బై చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా రెండు బాగా పండిన అరటిపండ్ల‌( Bananas )ను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే రెండు మందారం పువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

/br> """/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Ricinus ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని పాటిస్తే పొడిపొడిగా మారిన జుట్టు సిల్కీగా స్మూత్ గా మారుతుంది.

ఈ రెమెడీ సహజంగానే డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తుంది.కురులను హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

కుదుళ్లు బలోపేతం అవుతాయి.కాబట్టి డ్రై హెయిర్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నవారు ఇంట్లోనే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటించండి.

కురులను స్మూత్ గా మరియు సిల్కీగా మార్చుకోండి.

ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..