కోవర్ట్ లు రాజకీయాల్లో ఒక భాగం : రేణుక చౌదరి
TeluguStop.com
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) వర్గాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను వార్తలపై స్పందించారు రేణుక చౌదరి( Renuka Chaudhary ) .
అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు ఎవరు చెప్పారు అంటూ ఆమె తిరిగి ప్రశ్నించారు.
కాంగ్రెస్ లో అధిష్టానం మాటే ఫైనల్ అని ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాలను అధిష్టానం చూసుకుంటుందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు .
కాంగ్రెస్( Congress ) నేతలు కేసీఆర్ దగ్గర పాకెట్ మనీ తీసుకుంటున్నారు అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు.
"""/" / బండి సంజయ్( Bandi Sanjay ) ఎవరి దగ్గర పాకెట్ మనీ తీసుకుంటున్నారు నాకు తెలుసు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
కోవర్ట్ లు అన్ని పార్టీల్లోనే ఉంటారని, రాజకీయ సంస్కృతిలో కోవర్ట్ లు ఒక భాగం అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న రేణుకచౌదరి తన వర్గం నేతలతో ఎఐసిసి చీఫ్ మల్లికార్జున్ కర్కేతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాకూర్( Incharge Manik Rao Thakur ) తో కూడా ఆమె భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.
శ్రీనివాస్ రెడ్డి రాకతో తన వర్గ నేతలకు ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్న ఆమె టికెట్లు కేటాయింపు పై ముందుగానే పార్టీ అధిష్టానం నుంచి హామీ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
మరి ఇద్దరికీ కీలక నాయకులు మధ్య వర్గ పొరును కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా చక్కబడుతుందో అన్నది ఎప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
"""/" / ఏది ఏమైనప్పటికీ పాత నాయకులు పునరేకి కరణ తో కాంగ్రెస్లో కొత్త కళ కనిపిస్తుంది.
తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయడం కోసం కాంగ్రెస్ నాయకులకు అడుగు ముందుకు వేయడంతో వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, కేసీఆర్ని గద్ది దింపి కాంగ్రెస్కు అధికారం తీసుకురావాలని పట్టుదలతో నేతలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బాలయ్య అఖండ 2 సినిమాలో విలయ తాండవం చేయబోతున్నాడా..?