పవన్ ఆద్య క్యూట్ సెల్ఫీ… రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే!
TeluguStop.com
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన రాజకీయాలలోకి అడుగు పెట్టారు.
రాజకీయాల పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకొని నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం( Ap Deputy CM ) హోదాలో ఉన్నారు.
ఇకపోతే ఈయన డిప్యూటీ సీఎం గా మొదటిసారి కాకినాడ పోలీస్ గ్రౌండ్లో ఇండిపెండెన్స్ డే( Independance Day ) సెలబ్రేషన్స్ లో పాల్గొని జెండా ఎగరవేశారు.
"""/" /
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆధ్య( Aadhya ) తో కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రేణు దేశాయ్( Renu Desai ) ఈ ఫోటో పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా తన తండ్రితో కలిసి ఆధ్య సెల్ఫీ దిగిన ఫోటోని షేర్ చేస్తూ రేణు దేశాయ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
"""/" /
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో కలిసి వెళ్లనా అని ఆద్య నన్ను అడిగింది.
ఆధ్య అలా అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.తను కాస్త టైం తన తండ్రితో గడపాలని కోరుకుంటుంది.
సమాజంలో ఓ ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత విలువైనది కదా.
క్షణం కూడా తీరిక ఉండదు.కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన తండ్రి చేస్తున్న కృషి, ఆయన కేటాయిస్తున్న సమయాన్ని ఆధ్యా అర్థం చేసుకోవడం ఇంకా సంతోషం అంటూ ఈ ఫోటోపై ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఇటీవల పవన్ మంచి విజయం సాధించిన తర్వాత తన ఇద్దరు పిల్లలు పలు సందర్భాలలో తన తండ్రితో కలిసి కనిపిస్తున్నారు దీంతో వీరి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికలను పట్టించుకోని ఎన్ఆర్ఐ ఓటర్లు .. షాకిస్తోన్న ఈసీ నివేదిక