మోసపోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లాడివా… నెటిజన్ పై రేణు దేశాయ్ ఫైర్?

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాజీ భార్య సినీనటి రేణు దేశాయ్ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

అయితే ఈమె తన కొడుకు విషయంలో సోషల్ మీడియా వేదికగా నేటిజెన్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతూ ఉంటారు.

గతంలో తన కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై రేణు దేశాయ్ చేసినటువంటి కామెంట్ కు ప్రస్తుతం ఒక నెటిజన్ ఇచ్చినటువంటి రిప్లై పై రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

"""/" / గత కొద్ది రోజుల క్రితం రేణు దేశాయ్ అకిరా( Akhiraa )సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.

అంబానీ( Ambani ) తన వారసత్వాన్ని ఇతర చేతులలోకి పెట్టరు కదా అకిరా విషయంలో కూడా అదే జరుగుతుంది అంటూ ఈమె ఉదాహరణగా అంబానీ ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే ఈ కామెంట్ పై ఒక నెటిజన్ రియాక్ట్ అవుతూ అంబానీ సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు.

కానీ సినిమా ఇండస్ట్రీ అనేది ఏ కాపుదో కమ్మతో చౌదరిది కాదు ఇది అందరిదీ.

మమ్మల్ని మోసం చేయాలని అనుకోకండి అంటూ కామెంట్ చేశారు. """/" / ఈ కామెంట్ పై రేణు దేశాయ్( Renu Desai ) రియాక్ట్ అవుతూ సదురు నెటిజన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోసపోడానికి నువ్వేమైనా పిల్లాడివా లేక ఇడియట్‌వా? అసలు నేను ఏ ఉద్దేశంతో అంబానీ ప్రస్తావన తెచ్చానో చూసి ఉంటే నీకు ఇంత కోపం వచ్చేది కాదు.

నువ్వు కేవలం నీ సమస్యలను కూడా నీ చేతకాని తనంతో ఇతర వ్యక్తులను దూషించే రకం అంటూ సదరు నెటిజన్ పై ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ఇక మొదట సక్సెస్ ఫుల్ సినిమాలనే చేయాలనుకుంటున్నారా..?