టైగర్ నాగేశ్వరరావు నుండి రేణుదేశాయ్ ఫస్ట్ లుక్..!

మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) ఇప్పటికి ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు.

ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. """/" / ప్రజెంట్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''టైగర్ నాగేశ్వరరావు''( Tiger Nageswara Rao ).

నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్, సాంగ్ కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో వరుస ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో రేణు దేశాయ్( Renu Desai ) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

చాలా రోజుల తర్వాత ఈమె ఈ సినిమాలో నటిస్తుంది.మరి ఎప్పుడెప్పుడు ఈమె లుక్ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

"""/" / ఎట్టకేలకు ఈమె లుక్ ను మేకర్స్ రివీల్ చేసారు.

రేణు దేశాయ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్( Renu Desai Tiger Nageswara Rao First Look ) లో ప్లెజెంట్ గా చిరునవ్వుతో సింపుల్ గా కనిపించారు.

ఇక ఈమె హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ తో తెలిపారు.

ఇక ట్రైలర్ అక్టోబర్ 3న రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్( Gayatri Bharadwaj ) హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు.

అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

ఆన్‌లైన్ షాపింగ్ మాయ.. భార్య గోల.. భర్త కామెడీ టైమింగ్ మామూలుగా లేదు!