ఇక ఆపుతారా.. నేను ఆయన భార్యను కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు?

సినీ నటి రేణు దేశాయ్( Renu Desai ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే అయితే ఇటీవల కాలంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఇకపోతే ఈమె తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమె పోస్టులపై స్పందిస్తూ చేసే కామెంట్స్ సంచలనంగా మారుతూ ఉంటాయి.

"""/" / కొన్నిసార్లు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పెద్ద ఎత్తున గొడవకు దిగుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాము.

ఇటీవల ఈమె జంతువుల సంరక్షణ కోసం డబ్బు సహాయం అడుగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇలా జంతు సంరక్షణ కోసం భారీ స్థాయిలో డబ్బు డొనేట్ చేయడంతో మీది మా అన్నలా మంచి హృదయం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Kalyan Fans ) కామెంట్ చేశారు.

ఈ కామెంట్లకు రేణు దేశాయ్ స్పందిస్తూ ఆయనకు జంతువులు అంటే ప్రేమ లేదు అంటూ రిప్లై ఇచ్చారు.

అయితే మరి కొంత మంది అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ మీరు అలా మాట్లాడటం తప్పు అంటూ ఈమెకు సలహాలు ఇచ్చారు.

"""/" / పవన్ కళ్యాణ్ గురించి మీరు అలా మాట్లాడటం తప్పు ఎంతైనా ఆయన మీ పిల్లలకు తండ్రి.

మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందంటూ కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ పవన్ అభిమానులపై రెచ్చిపోయారు.

ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యని కాదు.నా మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉంటుంది, నేను యానిమల్స్ ని ప్రేమించినంతగా ఆయన ప్రేమించలేడు.

ఈ 55ఏళ్లలో ఆయన ఇంట్లో ఒక పెట్ కూడా మనకు కనిపించదు.ఇన్నేళ్లు నన్ను తిట్టడం చాలు నాకు లెక్చరర్స్ ఇవ్వడం కూడా ఇకపై ఆపండి అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మండిపడ్డారు.

పదేళ్ల కల నెరవేరింది…నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!