నేను చేసిన తప్పేంటి.. వైరల్ అవుతున్న రేణు దేశాయ్ సంచలన పోస్ట్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రేణ్ దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
నేను చేసిన తప్పేంటి అంటూ రేణు దేశాయ్(Renu Desai ) తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో సంచలన పోస్ట్ చేశారు.
కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రేణు దేశాయ్ టార్గెట్ గా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.
"""/" /
ఈ సోషల్ మీడియా వార్ గురించి రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ సమాజంతో ఇదే సమస్య అని ఎవరి కోసమో నేను మారాలా అని ఆమె ప్రశ్నించారు.
మీరు చెప్పిన విధంగా జీవించడానికి నేను చేసిన తప్పేంటని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.
సలహా ఇవ్వడం చాలా సులువు అని బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుందని రేణు దేశాయ్ కామెంట్లు చేశారు.
రేణు దేశాయ్ పోస్ట్ గురించి పవన్ ఫ్యాన్స్( Pawan Kalyan ) ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
"""/" /
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పవన్ సైతం వేగంగా సినిమాలలో నటించడంతో పాటు తక్కువ రోజుల్లో షూట్ పూర్తయ్యే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.
హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) మినహా మిగతా సినిమాలకు పవన్ తక్కువ డేట్లు కేటాయించారని బోగట్టా.
పవన్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతున్నారు. """/" /
వేగంగా సినిమాల్లో నటిస్తున్నా మినిమం గ్యారంటీ సినిమాలకు పవన్ ఓటేస్తున్నారు.
మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.పవన్ అడిగిన స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
1000 కోట్లు సాధిస్తేనే సినిమా హిట్.. సౌత్ సినిమాలు ప్రూవ్ చేస్తున్న లెక్క ఇదేనా?