రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్.. నేను మనుషులను ద్వేషిస్తున్నాను అందుకే..
TeluguStop.com
రేణు దేశాయ్( Renu Desai ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కొడుకు, కూతురుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
అంతేకాకుండా రెగ్యులర్ గా ఏదో ఒక విషయంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులపై నెటిజన్స్ నుంచి విభిన్న అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో రేణు దేశాయ్ ఓ పోస్టర్ రూపంలో కొన్ని అందర్నీ ఆలోచించే విధంగా చేస్తూ ఉంటే.
మరికొన్ని ప్రతి ఒక్కరి హృదయాన్ని తీవ్రంగా కదిలిస్తూ ఉంది. """/" / వాస్తవానికి రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు( Animal Lover ) అని అందరికి తెలిసిన విషయమే.
ఎప్పటికప్పుడు జంతువుల పై తన ప్రేమను వ్యక్తం చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
అయితే, తాజాగా ఫెలిసెట్ అనే పిల్లి( Cat ) గురించి సోషల్ మీడియాలో నేను దేశాయ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.
ప్రస్తుత సమాజంలో జంతువుల పై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ఎప్పటికప్పుడు జంతువుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్న తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం పరుస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా ఫెలిసెట్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపించేందుకు అనేక ఇబ్బందులు పెట్టారని, """/" /
చాలా వారాల పాటు ఆ పిల్లిని చిత్రహింసలకు గురి చేసి రెడీ చేసి పంపించారని.
ఈ క్రమంలో ఒక గట్టి కంటైనర్ లో ఆ పిల్లిని కూర్చోబెట్టి కదలకుండా గట్టిగా బంధించడంతోపాటు, ఆ పిల్లి శరీరంలో ఎలక్ట్రోడ్ ఏర్పాటు చేయడం.
ఇలా ఇలాంటివన్నీ ఆ పిల్లి కట్టుకొని అంతరిక్షంలో( Space ) రెండు నెలల పాటు శాస్త్రవేత్తల ప్రయోగానికి పడవలసి వచ్చిందని, అలా ఆ చిన్న జీవిని దారుణంగా చిత్రహింసలు గురి చేయడం చాలా దారుణం అంటూ రేణు దేశాయ్ ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇది ఇలా ఉండగా.రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలక పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించారు.
ఇదేక్కడికి ట్విస్ట్.. పాక్‌లో స్వీట్లు అమ్ముకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు.. వీడియో చూడండి!