సెల్ఫీలు అంటూ నడుం పట్టుకుంటారు… రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!

సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలు బయటకు వస్తే వారితో సెల్ఫీ తీసుకోవాలని అభిమానులు చాలా ఆత్రుత పడుతుంటారు ఈ క్రమంలోనే సెల్ఫీ( Selfie ) ల కోసం సెలబ్రిటీలను ఒక్కరి బిక్కిరి చేస్తూ ఉంటారు.

ఇలా సెల్ఫీలంటూ సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం గురించి తాజాగా నటి రేణు దేశాయ్( Renu Desai ) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను కాశీకి వెళ్లినప్పుడు వీఐపీ ప్రోటోకాల్ తో కాకుండా సాధారణ భక్తురాలి గాని వెళ్లానని తెలిపారు.

కాశీలో( Kashi ) మన తెలుగువారు ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. """/" / ఇలా సాధారణ భక్తురాలిగా దర్శనం కోసం వెళ్లడంతో అభిమానులు తనని చుట్టుముట్టారని అడుగు తీసి అడుగు ముందుకు వేసేలోపు సెల్ఫీ కావాలి అంటూ ఇబ్బంది కలుగజేసారని తెలిపారు.

ఇక తినడానికి హోటల్ వెళ్తే హోటల్ వరకు కూడా సెల్ఫీ కావాలి అంటూ వెంబడించారని రేణు దేశాయ్ తెలిపారు.

ఇక కుంభమేళాలో( Kumbhmela ) కూడా ఇదే ఘటన చోటు చేసుకుందని సెల్ఫీల కోసం ఊపిరాడిన ఇవ్వడం లేదని తెలిపారు.

ప్రశాంతంగా ఉండటం కోసం తాను కాశీ గంగా నది ఒడ్డున మెడిటేషన్ చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడికి కూడా సెల్ఫీలు అంటూ అభిమానులు వచ్చారు.

"""/" / ఈ సెల్ఫీల విషయంలో అమ్మాయిలు అయితే మరింత రూడ్ గా ఉన్నారని తెలియజేశారు.

సెల్ఫీ కోసం వస్తూ నడుం మీద చేతులు వేస్తుంటారు.చాలా కష్టంగా ఉంటుంది.

జనాలు సెలబ్రిటీలను ప్రశాంతంగా ఉండనివ్వరు.అందుకే VIP ప్రోటోకాల్ తో వెళ్లడమే మంచిది.

నేను కాశీలో ఏకంగా ట్రామా చూసాను అంటూ అభిమానుల కారణంగా సెలబ్రిటీలు పడే ఇబ్బందుల గురించి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.