రేణు దేశాయ్ రెండో పెళ్లి వివరాలు ఇవే.. భర్త ఎవరో తెలుసా?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కళ్యాణ్ తన కోస్టార్ రేణుదేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
అయితే వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో చివరికి విడాకులు తీసుకుని విడిపోయారు.
అయితే ఏళ్లు గడుస్తున్నా వీరికి సంబంధించిన ఏదైనా వార్త సోషల్ మీడియాలో కి వచ్చిందంటే చాలు క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.
బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి రేణుదేశాయ్ నటించింది.తర్వాత జానీ సినిమాలోనూ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అయింది అని చెప్పాలి.
కొన్నాళ్ళ పాటు సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.వీరికి అఖిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో రేణు దేశాయ్ ను అధికారికంగా భార్యగా స్వీకరించాడు పవన్ కళ్యాణ్.
కానీ ఆ తర్వాత రెండేళ్లకు మనస్పర్థలు తలెత్తాయి.తీన్మార్ సినిమాలో కలిసి నటించిన అన్న లెజెన్నోవా ను మూడో పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్.
చాలాకాలం పాటు తల్లిదండ్రుల వద్దే ఉన్న రేణు దేశాయ్ గత ఏడాది రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.
అతడితో ఎంగేజ్మెంట్ అయినా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.
"""/"/
ఈ క్రమంలో రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముఖాన్ని దాచి రింగ్ మాత్రమే చూపించింది.
దీంతో ఇక రేణు దేశాయ్ పెళ్లి చేసుకోబోయే రెండో భర్త ఎవరు అన్నదానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పాలి.
ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు రాగానే పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తమ కొడుకు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మళ్ళీ కలవడంతో అభిమానులు కూడా ఎంతగానో మురిసిపోయాడు అని చెప్పాలి.
ఏదేమైనా ఇప్పటికికూడా పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి గురించిన వార్త ఎప్పుడు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్23, సోమవారం2024