రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు… సంతోషం వ్యక్తం చేసిన నటి!

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ సతీమణి రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు(Divorce) తీసుకున్న ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు.

అయితే ఇన్ని రోజులు సినిమాలకు కూడా దూరంగా ఉన్న రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఈమె అభిమానులతో పంచుకుంటారు.

"""/" / ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించడంతో రేణు దేశాయ్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ ఉన్నారు.

తన తండ్రి విజయం సాధించిన తర్వాత ఈమె పిల్లలు ఇద్దరు కూడా తన తండ్రి వెంటే ఉంటూ ఎంతో మంది ప్రముఖులను కలుస్తూ ఉన్నారు.

ఇలా తన పిల్లలు నరేంద్ర మోడీ( Narendra Modi ) వంటి వారిని కలవడం పట్ల ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టుల చేశారు.

అయితే తాజాగా రేణు దేశాయ్ మరొక పోస్ట్ చేశారు.తాజాగా ఈమె తన ఇంట్లో పూజ కార్యక్రమాలను చేసుకున్నారని తెలుస్తోంది.

"""/" / ఎంతో సాంప్రదాయబద్దంగా చీర కట్టుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తూ స్వామి వారికి నైవేద్యం తయారు చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన రేణు దేశాయ్ తన చేతులతో స్వయంగా ప్రసాదం చేసి పూజ చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొంది.

పూజ హోమం చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నట్లు రేణు దేశాయ్ పేర్కొన్నారు.

అయితే ఈమె తన మాజీ భర్త ఎన్నికలలో విజయం సాధించినందుకే ఇలా తన ఇంట్లో పూజలు హోమాలు చేసుకున్నారా అంటూ పలువురు ఈ ఫోటోలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా రేణు దేశాయ్ మాత్రం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?