సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రాండ్ సక్సెస్ కొట్టిన రేణుదేశాయ్…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ హీరో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
దాంతో ఈయన తెలుగులో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఈయన బద్రి సినిమా( Badri )తో యూత్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రేణదేశాయ్( Renu Desai ) ని ప్రేమించి, పెళ్లి చేసుకొని ఇద్దరూ కొంతకాలం పాటు మంచి లైఫ్ ని అనుభవించారు.
ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోవడం జరిగింది.ప్రస్తుతం ఆమె వాళ్ళ పిల్లలతో పుణె లో ఉంటుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తూ సామాజిక కార్యకర్త హేమలత లవణం అనే క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
"""/" /
ఇక ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఉత్సాహంతో ఇకమీదట తెలుగు సినిమాల్లో మంచి క్యారెక్టర్లు దొరికితే నటించడానికి తను ఎప్పటికీ సిద్దం గా ఉంటానని చెప్పింది.
ఇక ఈ క్రమంలో రిపోర్టర్ మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అడగాగ దానికి సమాధానం చెబుతూ రాజకీయం అనేది ఒక బురద లాంటిది.
దాంట్లోకి వచ్చి ఇబ్బందులు పడే కంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపడం చాలా మంచిది అందుకే నేను రాజకీయాల్లోకి రాను కానీ నా పరిధిలో ఉన్న వారికి సహాయం కావాలంటే మాత్రం తప్పకుండా చేస్తాను.
"""/" /
నావల్ల సాధ్యమైనంత వరకు సహాయం చేస్తాను అంటూ తన సమాధానం చెప్పింది.
ఇక రెండో పెళ్లి గురించి కూడా ప్రస్తావన రావడంతో ఇప్పుడప్పుడే నాకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమైతే లేదు అన్నట్టుగా చెప్పింది.
ఇక వాళ్ళ అబ్బాయి అయిన అఖిరా నందన్( Akira Nandan ) కూడా తొందర్లోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టుగా కూడా చెప్పింది.
రాజమౌళి ఆర్టిస్టులను అనౌన్స్ చేసే రోజు ఎప్పుడో తెలిసిపోయిందిగా..?