దండం పెడతాను నన్ను వదిలేయండి…పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన రేణు దేశాయ్!

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాజీ భార్య సినీనటి రేణు దేశాయ్( Renu Desai ) విడిపోయి చాలా సంవత్సరాలు అవుతున్న రేణు దేశాయ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ట్రోల్ చేస్తుంటారు.

అయితే తాజాగా రేణు దేశాయ్ మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానుల పై( Pawan Kalyan Fans ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈమె తాను సంపాదించిన దానిలో కొంత భాగం కుక్కలు, పిల్లులు, పలు జంతువుల కోసం సర్వీస్ చేస్తుంది.

"""/" / ఈ విషయం గురించి ఒక పవన్ అభిమాని స్పందిస్తూ.మీరు కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లాగా గోల్డెన్ హార్ట్ అని కామెంట్ చేశాడు.

దీనికి రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ పవన్ ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకు నేను చేసే ప్రతి పోస్ట్ కింద నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేసి పెడతారు.

నేను ఏ పని అయినా కూడా స్వతంత్రంగా నా ఇష్టపూర్వకంగా చేస్తాను కాని దానిని కూడా నా మాజీ భర్తతో కంపేర్ చేసి పోస్టులు పెడుతుంటారు.

"""/" / ఇలాంటి వాళ్ళని చాలామందిని బ్లాక్ చేశాను, డిలీట్ చేశాను.నేను సింగిల్ గా యానిమల్ సర్వీస్( Animal Service ) చేస్తున్నాను.

దయచేసి నేను చేసే ఈ పనులను నా మాజీ భర్తతో( Ex-Husband ) పోల్చి చూడకండి మీకు దండం పెడతాను.

నా మాదిరి ఆయనకు జంతువులు అంటే ప్రేమ లేదు జంతువులకు సర్వీస్ చేయాలని తాపత్రయం లేదు అంటూ రేణు దేశాయ్ మండిపడ్డారు.

నాకు ఆయనతో ఏ విధమైనటువంటి పర్సనల్ ప్రాబ్లం లేదు కానీ ఆయన ఫాలోవర్స్ తోనే ప్రాబ్లం ఉందంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మండిపడ్డారు.

ఇలా రేణు దేశాయ్ చేసిన ఈ పోస్టుపై పలువురు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

‘జనసేన ‘కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ?