ప్రతిభ ఉంటేనే స్టార్స్ అవుతారు… వారసులు కావడం వల్ల కాదు: రేణు దేశాయ్
TeluguStop.com
సాధారణంగా తల్లిదండ్రులు ఏ వృత్తిలో కొనసాగుతారో పిల్లలు కూడా అదే వృత్తిలో కొనసాగాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు.
ఈ క్రమంలోనే డాక్టర్ పిల్లలు డాక్టర్లు కావడం లాయర్ పిల్లలు లాయర్స్ కావడం జరుగుతుంది.
ఈ క్రమంలోనే హీరోల పిల్లలు హీరోలు గానే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఈ విషయాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు అయితే ఈ విషయంపై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఇదివరకే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తేనే సక్సెస్ కారని, వారికి టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతారు లేదంటే ఇండస్ట్రీకి దూరమవుతారని పలువురు తెలియజేశారు.
"""/" /
ఇలా స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వారి గురించి ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడం సర్వసాధారణం అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కుమారుడు అఖీరా( Akira ) సినిమాలలోకి రాకముందే ఆయన పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉంది ఈ క్రమంలోని ఒక నెటిజన్ ఏకంగా రేణు దేశాయ్ ( Renudesai )అని ప్రశ్నిస్తూ వారసులకు సినిమా ఇండస్ట్రీలో ఈజీగా అవకాశాలు వస్తాయి ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఆమెను ప్రశ్నించారు ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానం చెబుతూ.
మీ ప్రశ్న చాలా సమంజసంగానే ఉందని తెలిపారు.అంబానీ తన ఆస్తికి ఇతరులను వారసులకు ప్రకటిస్తే సమంజసంగా ఉంటుందా అంటూ ఈమె ఎదురు ప్రశ్న వేశారు.
"""/" /
హీరోలగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు వారి పిల్లలను హీరోలుగా పరిచయం చేస్తున్నారు.
ఇది చాలా సులువుగానే జరుగుతుంది.ఇలా వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఇండస్ట్రీలో వారు సక్సెస్ కాలేకపోయినా తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్ట లేకపోయినా కొంతమంది పని కట్టుకొని మరి వారిని విమర్శిస్తూ ఉంటారు.
సినీ వారసులు కాకుండా కొత్తవారు ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కాకపోయినా వారి గురించి పట్టించుకోరు కానీ వారసులు సక్సెస్ కాకపోతే దారుణంగా విమర్శలు చేస్తారని రేణు దేశాయ్ తెలిపారు.
ఇక్కడ విషయం ఏమిటంటే వారసులుగా ఇండస్ట్రీలోకి రావడం ముఖ్యం కాదు వాళ్లలో ఉండే టాలెంట్ ముఖ్యం.
ప్రతిభ ఉంటేనే ఎవరైనా స్టార్స్ అవుతారు కానీ వారసులు కావటం వల్ల స్టార్స్ కాలేరు అంటూ ఈ సందర్భంగా నెపోటిజం( Nepotizam )పై రేణు దేశాయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొత్త కోడలికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు… అమల సంచలన వ్యాఖ్యలు!