సుమను ఆ మాట అంటూ ఏడిపించిన రేణు దేశాయ్!

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమెకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు.

మొదట్లో అమెరికా అమ్మాయ్ అంటూ సీరియల్ తీసిన ఆ తర్వాత అంత కూడా బుల్లితెర యాంకర్ గా ఫిక్స్ అయిపోయారు.

అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించిన ఆతర్వాత సినిమాల్లో కనిపించిన రోజులు చాలా అంటే చాలా తక్కువ.

ఇక ఇప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న యాంకర్ సుమ ఇప్పుడు సొంతంగా ఓ యూట్యూబ్ స్టార్ చేసింది.

ఆ యూట్యూబ్ లో ఈట్ విత్ సుమక్క అనే షో.నిజానికి ఇది కూడా ఒక వంటల షో అయినప్పటికీ కాస్త డిఫరెంట్ అనమాట.

అంటే ఈ షోలో సుమక్క వంటలు చెయ్యదు.సుమ షో కి వచ్చిన గెస్ట్ లు వంట చేస్తారు.

అలానే మొదట్లో సుడిగాలి సుధీర్ ని షో కి పిలిపించి అతనికి బాగా వచ్చిన వంట పులిహోరను చేపించి.

అతను మాట్లాడే మాటలకు సెటైర్లు వేస్తూ పంపించింది.ఇంకా రీసెంట్ గా శ్రీముఖితోను వంట చేయించింది సుమక్క.

యాంకర్ ప్రదీప్ ని, బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ తో కూడా వంట చేయించింది.

ఇప్పుడు ఏకంగా రేణు దేశాయ్ తోనే వంట చేయించింది సుమక్క.సుమ, రేణు దేశాయ్ కలిసి యాపిల్ పై చేశారు.

సుమక్క ప్రోగ్రాంకు రేణూ అతిదిగా వచ్చిన రేణు దేశాయ్ యాంకర్ సుమను అక్క అక్క అంటూ ఏడిపించారు.

నువ్వు నాకు అక్క అయితేనే కదా నా పిల్లలకు పెద్దమ్మ అయ్యేది అంటూ వీడియో చేశారు.

ఇద్దరు కలిసి వారి మాటలతో సందడి చేస్తున్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓసారి చూసేయండి!.

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియంకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్