Renu Desai: 47 ఏళ్లకే తన నానమ్మ పోయారట.. ఇప్పుడు అదే జబ్బు నాకు వచ్చింది
TeluguStop.com
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.
ఆమె నటించింది రెండు మూడు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ముద్దుగుమ్మ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యింది.వాటిలో తన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలిపింది.
అంతేకాకుండా తనకొక జబ్బు ఉందని ఆమె వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది.ఆమె ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
"నేను ఒక పుట్టుక లోపంతో పుట్టాను.ఆ బర్త్ డిఫెక్ట్ ని( Birth Defect ) అధిగమించడానికి చేసేదేం లేదు.
ముందు నాకు ఆ విషయం అసలు తెలియదు.కానీ టెస్టులు చేయించిన కొద్దీ ఆ సమస్య ఏంటో తెలుస్తూ వచ్చింది.
చివరికి సీటీ స్కాన్ చేయించుకున్నాక ఆ జబ్బు ఉన్నట్లు తేలింది.దాని గురించి ఎవరూ ఏం చేసేది లేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసా.
మా నాయనమ్మ కి( Grandma ) కూడా ఇదే జబ్బు ఉంది. """/" /
ఆమె 47 సంవత్సరాలకే హార్ట్ అటాక్‌తో( Heart Attack ) చనిపోయింది.
అందుకే నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.ప్రాణాయామ, యోగా, వ్యాయామం వంటివి చేస్తున్నా.
తిండి మీద కూడా నాకు కంట్రోల్ ఉంటుంది.నా శరీరంలో, నా ఆర్టరిస్‌లో ఎలాంటి కొలెస్ట్రాల్ పేరుకుపోలేదు.
బైపాస్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు.కానీ పుట్టుకలోనే లోపం ఉంది.
" అని రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. """/" /
తన హార్ట్ రేట్ పైకి వెళ్లకుండా ఉండేందుకు బీటా బ్లాకర్( Beta Blocker ) అనే ఒక మెడిసిన్ ఇస్తారని రేణు దేశాయ్ తెలిపింది.
అది తీసుకోవడం వల్లే కాస్త ఫ్యాట్ ఎక్కానని ఆమె తెలిపింది.ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆమె ఆరోగ్యం బాగుండాలని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులతో పాటు ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ఇలాంటి బర్త్ డిఫెక్ట్ అకిరా,( Akira ) ఆద్యలకు( Aadhya ) ఉండకూడదని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
అయితే రేణు ఇలాంటి జబ్బు తనకే ఉందా? తన చుట్టాల్లో ఇంకా ఎవరికైనా వచ్చిందా అని వివరాలు తెలపలేదు.
ఆ జబ్బు పేరు ఏంటనేది కూడా ఆమె వెల్లడించలేదు.
హరీష్ శంకర్ నిర్మాత గా కిరణ్ అబ్బవరం సినిమా రాబోతుందా..?