ఏపీలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం..!

ఏపీలోని రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో రన్‌వేపై పెను ప్రమాదం తృటిలో తప్పింది.

ఈ ఘటనలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ప్రమాదం నుండి బయటపెట్టారు.పెను ప్రమాదం తప్పడంతో అధికారులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే వివరాల్లోకి వెళ్తే.ఆదివారం రన్‌ వేను పరిశీలించేందుకు వెళ్లిన ఫైరింజన్‌ అదుపు తప్పి బోల్తా పడింది.

దీన్ని గుర్తించిన బెంగళూరు- తిరుపతి విమానంలోని పైలట్‌ రన్‌ వేపై ల్యాండ్‌ చేయలేదు.

దీంతో పెను ప్రమాదం తప్పింది.దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

అదే సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.

దీంతో ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.అయితే మరికొన్ని విమానాలు కూడా ల్యాండింగ్ కాకుండా తిరుగు పయనమయ్యాయని సమాచారం.

రేణిగుంట విమానాశ్రయంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.ఇండిగో విమానంలో 150మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తునట్టు సమాచారం.

ప్రస్తుతం అధికారులు రన్‌వేపై బోల్తా పడిన ఫైర్ ఇంజన్ వాహనం తొలగింపు పనులను ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.ఫైర్‌ ఇంజన్‌ బోల్తాపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా.లేక ఇంకేమైన కారణంగా ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారిస్తున్నారు.

ఈ సంఘటనపై విమానాశ్రయ డైరెక్టర్ ఎస్.సురేష్ మాట్లాడుతూ.

ప్రమాదం జరిగిన రెండున్నర గంటల్లో రన్ వే క్లియర్ చేసినట్లు తెలిపారు.దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

ఈ ఘటనపై కాస్సేపట్లో రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ యాసలో గలగల మాట్లాడిన అర్హ… మాటలకు ఫిదా కావాల్సిందే !