అనధికార,అక్రమ నిర్మాణాలు తొలగించండి:మంత్రి కోమటిరెడ్డి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ కౌన్సిల్ హాల్, రికార్డు రూమ్, రెస్ట్ రూమ్ లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మురికికాలువల అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, మురికి కాలువలు పొంగి పొర్లకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని,ఎక్కడా మురికి కాలువలు పూడికతో పూడిపోకుండా పూడిక తీయించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని,వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు.
అలాగే పట్టణంలో అనాధికారిక నిర్మాణాలను,ప్రభుత్వ స్థలాలలో ఎవరైనా ఆక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.