గాంధీ బొమ్మ తీసేయండి ...గాంధీ ముని మనవడు సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com

గాంధీ ముని మనవడు తుషార్ అరుణ్ గాంధీ డిజిటల్ కరెన్సీ పై అసంతృప్తిని మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


డిజిటల్ కరెన్సీ పై గాంధీ బొమ్మ వేయనందుకు ఆర్బిఐ కి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ క్రమంలో పేపర్ కరెన్సీ పైన గాంధీ బొమ్మని తొలగించండి అంటూ తుషార్ అరుణ్ గాంధీ ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు.
మరి గాంధీ ముని మనవడు చేసిన ఈ కామెంట్లపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
ఇటీవల RBI సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబీడిసీ/ఈ రూపీ) నీ విడుదల చేసింది.
దీనిని రిటైల్ మరియు హోల్సేల్ లావాదేవీలకు ఉపయోగిస్తూ ప్రయోగాత్మకంగా దేశంలో కొన్ని పట్టణాలలో పరీక్షిస్తున్నారు.
అయితే ఈ డిజిటల్ రూపీపై మహాత్మా గాంధీ ఫోటో లేకపోవడంతో గాంధీ ముని మనవడు పై రీతిగా స్పందించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
కరెన్సీ నోట్ల కంటే డిజిటల్ కరెన్సీ వల్ల నగదు నిర్వహణ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని.
RBI ప్రయోగాత్మకంగా ప్రస్తుతం కొన్ని పట్టణాల్లో డిజిటల్ కరెన్సీ విడుదల చేయడం జరిగింది.
యూపీ అబ్బాయి కోసం చైనా నుంచి వచ్చి.. లెహంగాలో అదరగొట్టిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..