అంతర్ రాష్ట్ర రవాణాపై ఆంక్షలు తొలగింపు : కేంద్రం

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.లాక్ డౌన్ లో ఎక్కడి వాళ్లు అక్కడే ఉపాధి లేకుండా ఇబ్బందులు పడ్డారు.

వలస కార్మికుల జీవితాలు చూడలేని పరిస్థితి.అయితే లాక్ డౌన్ లో ప్రభుత్వాల కృషి, దాతల సాయంతో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించారు.

సొంత రాష్ట్రాల ప్రజలు ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో కార్మికులు పల్లె బాట పట్టారు.

రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్టార్ట్ అయినా అది కేవలం రాష్ట్రానికే పరిమితమైంది.వేరే రాష్ట్రాల నుంచి రాకపోకలు ఇంకా కొనసాగడం లేదు.

అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నా అంతర్ రాష్ట్ర రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

అయితే తాజాగా కేంద్రం రవాణాలపై ఆంక్షలు తొలిగించింది.అంతర్ రాష్ట్ర రవాణా కొనసాగేలా ఆదేశాలు జారీ చేసింది.

అంతర్ ర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు తొలిగించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.

వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో స్పష్టం చేశారు.ఆర్థిక కార్యకలాపాలకు, ఉపాధిపై ప్రభావం చూపుతోందని, ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తోందని వారు లేఖలో పేర్కొన్నారు.

ఫిర్యాదును స్వీకరించి కేంద్రం గుడ్ న్యూస్ ను అందించింది.దీంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నిబంధనలు లేకుండా ప్రయాణించే సౌకర్యం కల్పించింది.

యంగ్ హీరోల్లో రామ్ బాగా వెనకబడ్డాడా..?