మీ ముఖం, మెడ ఒకే రంగులో మెరవాలంటే ఈ రెమెడీని ట్రై చేయండి!
TeluguStop.com

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా, మృదువుగా మెరిసిపోతూ ఉంటుంది.కానీ, మెడ మాత్రం డార్క్‌గా ఉంటుంది.


మరికొందరికి మెడ అందంగా ఉంటుంది.కానీ, ముఖం మాత్రం నల్లగా, కాంతిహీనంగా కనిపిస్తుంటుంది.


దాంతో ముఖం, మెడను ఒకే రంగులో మెరిపించుకోవడం కోసం ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్ ఇలా ఎన్నెన్నో యూస్ చేస్తుంటారు.
అయితే వాటి వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు గానీ.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే మాత్రం మీ ముఖం, మెడ ఒకే రంగులో అందంగా మెరుస్తాయి.
మరి ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.ముందుగా పచ్చి పాలల్లో దూదిని ముంచి ముఖాన్ని, మెడకు క్లెన్సింగ్ చేసుకోవాలి.
క్లెన్సింగ్ వల్ల చర్మం క్లీన్‌గా, ఫ్రెష్‌గా మారుతుంది.అలాగే చర్మం స్మూత్‌గా కూడా తయారవుతుంది.
క్లెన్సింగ్ చేసుకున్న అనంతరం ఒక అరటి పండును తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక టమాటోను తీసుకుని వాటర్‌లో కడిగి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో అరటి పండు ముక్కలు, టమాటో స్లైసెస్ వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్, పావు స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఐదేనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే ముఖం, మెడ ఒకే రంగులోకి మారి అందంగా, ఆకర్షణీయంగా మెరుస్తాయి.
న్యాచురల్ స్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట.. ఎవరో తెలిస్తే ఒకింత షాకవ్వాల్సిందే!