వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగి ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయకూడదు..!
TeluguStop.com
మన దేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Sastram ) బలంగా నమ్ముతారు.
అలాగే కొంతమంది వాస్తు శాస్త్రాన్ని పట్టించుకోని వారు కూడా ఉన్నారు.కానీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తూ ఉంటారు.
వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులు అయినా చేసేస్తూ ఉంటారు.
అయితే ఇంటి నిర్మాణం సమయంలో మాత్రమే కాకుండా ఇంటి నిర్మాణం కోసం స్థలం( Plot ) కొనుగోలు చేసేటప్పుడు కూడా వాస్తు కచ్చితంగా చూడాలి.
ఇంటి నిర్మాణం( Home Construction ) కోసం కొనుగోలు చేసే స్థలంలో కొన్ని మూలలు పెరిగితే మంచిది.
వాస్తు శాస్త్రానికి విరుద్ధంగా మూలలు పెరిగిన స్థలాలను కొనవాల్సి వస్తే వాటిని వాస్తు నియమాల రిత్యా సరిచేసుకొని అప్పుడు నిర్మాణం చేసుకుంటే అక్కడ సుఖసంతోషాలు ఉంటాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఏ మూలాలు పెరిగితే మంచిదో, ఏ మూలలు సమంగా ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
తూర్పు ఆగ్నేయ మూల పెరగడం ఏ మాత్రం క్షేమదాయకం కాదు.
ఈ మూల ఎక్కువగా ఉన్న స్థలం కొనుగోలు చేస్తే ఆ మూలను సరి చేసుకున్న తర్వాతే గృహ నిర్మాణం మొదలుపెట్టాలి.
పెరిగిన మూలలో ఉన్న స్థలాన్ని సమం చేసి గృహ నిర్మాణ స్థలంలో కలపకుండా వేరుగా ఉంచాలి.
ఈ స్థలాన్ని మొక్కలు పెంచేందుకు ఉపయోగించాలి.ఇంకా చెప్పాలంటే తూర్పు ఈశాన్యం పెరిగితే తొలగించాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
"""/" /
ఇలాంటి స్థలం అదృష్టం అని చెప్పవచ్చు.ఆయురారోగ్య ధనధాన్యాభివృద్ధికి ఈ స్థలం నిలయం అవుతుంది.
డబ్బు అదనంగా ఇచ్చేనా ఇలాంటి స్థలాన్ని కొనవచ్చు.ఉత్తర ఈశాన్యం పెరిగి ఉన్న స్థలాన్ని కూడా మరో ఆలోచన లేకుండా కొనుగోలు చేయవచ్చు.
ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలాన్ని తొలగించాల్సిన అవసరం ఏమీ లేదు.ఈ ప్రదేశంలో బరువైన నిర్మాణాలు అసలు చేయకూడదు.
ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేస్తేనే వాస్తు రీత్యా ఎంతో మంచిది.ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటే పెరిగిన మేరకు తొలగించి దానిని నిర్మాణానికి ఏ మాత్రం ఉపయోగించకూడదు.
ఆ సమయంలో చనిపోతానని అనుకున్నా.. మనీషా కోయిరాలా కామెంట్స్ వైరల్!